ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టును ఆశ్రయించారు నాగార్జున. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై న్యాయ పోరాటంకు సిద్ధం అవుతున్నారు అక్కినేని నాగార్జున.
అటు ఇప్పటికే నేను కబ్జానే చేయలేదంటూ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు నాగార్జున. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను అంటూ పోస్ట్ పెట్టారు నాగార్జున.
- ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టులో నాగార్జున పిటిషన్.
- N కన్వేన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్.
- ఈ రోజు కూల్చివేత పై కోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున.