Ravi Teja discharged from hospital: నటుడు రవితేజ ఫ్యాన్స్ కు శుభవార్త. హాస్పిటల్ నుంచి నటుడు రవితేజ డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో రవితేజ పోస్ట్ పెట్టారు. సాఫీగా సాగిన సర్జరీ తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను అంటూ ఎక్స్ లో రవితేజ పోస్ట్ పెట్టారు. మీ అందరి ఆశీర్వాదాలు మరియు మద్దతుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు రవితేజ.

కాగా నిన్న తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రవితేజ కుడిచేతి కి గాయం అయ్యింది. కానీ దానిని లేక చేయకుండా ఆ గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నాడు రవితేజ. కానీ ఆ కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రిలో చేరిన రవితేజకు వైద్యులు శస్త్రచికిత్స చేసారు. అలాగే మరో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారు.