సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..కారణం ఇదే !

-

సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఎయిమ్స్ బీబీనగర్ కు అనుబంధంగా అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరం నడిబొడ్డున 2 ఎకరాల భూమిని కేటాయించాలని, అప్పటి వరకూ తాత్కాలికంగా ఏదైనా ప్రభుత్వ భవనాన్ని కేటాయించాలని కోరుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడానికి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మొదలుకొని అన్ని స్థాయిలలో ఆరోగ్య కేంద్రాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

kishan reddy on cm revanth reddy

అందులో భాగంగానే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎయిమ్స్ ఆసుపత్రులను మోదీ ప్రభుత్వం నెలకొల్పుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2019 లో బీబీనగర్ లో రూ. 1,300 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్ బీబీనగర్ లో ఓపీడీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎయిమ్స్ మెడికల్ కాలేజీని కూడా కొత్తగా ఏర్పాటు చేయడం, ప్రస్తుతం వైద్య కళాశాల తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్ నూతన భవనాలు చాలా వేగవంతంగా నిర్మాణం జరుగుచున్నవని వెల్లడించారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ & ట్రైనింగ్ సెంటర్ (UHTC) ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రం ద్వారా వైద్య విద్యార్థులకు అవసరమైన బోధన & శిక్షణ కార్యక్రమాలను, నగరంలో నివశిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news