పలు కంపెనీల నుంచి రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఐటీ నోటీసులతో ఆయన తేలు కుట్టిన దొంగలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటకు వచ్చింది తీగ మాత్రమేనని, డొంక కదలాల్సి ఉందని చెప్పారు.
కంపెనీల నుంచి అవినీతి సొమ్ము వసూలుకు బాబు అనుచరుడు ఎంవిపి మీడియేటర్ గా పనిచేసినట్లు తేలిందన్నారు. నారావారిపల్లి నుంచి జూబ్లీహిల్స్ భవంతి వరకు అవినీతి పునాదులు మీద నిర్మించిందని ఆరోపణించారు. 118కోట్లు లంచం తీసుకున్నారని ఇన్ కం టాక్స్ చెబుతుంటే చంద్ర బాబు ఎందుకు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్నా హజారే అనుచరుడు…గాంధీజీ తమ్ముణ్ణి అని చెప్పుకునే చంద్రబాబు తనపై లంచగొండి ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.