నాగార్జున కోసం చార్టెడ్ ఫ్లైట్‌!

-

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఇటీవ‌లే ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. షో రోజు రోజుకీ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతోంది. రోజు రోజుకీ రేటింగ్స్ పెరిగిపోతున్నాయి. ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వ‌ర‌ల్డ్ బిగ్సెస్ట్ రియాలిటీ షోని మిస్ చేసుకోవ‌డానికి నాగ్ ఇష్ట‌ప‌డ‌టం లేదు. పైగా వారాంత‌ల్లో వ‌చ్చి షోని హీటెక్కిస్తున్నారు.

దీనితో పాటు నాగ్ త‌న `వ‌ల్డ్ డాగ్‌` షూట్‌ని కూడా మిస్సవ్వ‌లానుకోవ‌డం లేద‌ట‌. 2009లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అషిషోర్ సాల్మ‌ర్ రూపొందిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ డ్రామా షూటింగ్ ఈ నెలాఖ‌రు నుంచి కులుమ‌నాలిలో ప‌ది రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి నుమ‌తులు పొందారు. నాగ్ కోసం ప్ర‌త్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ ని ఏర్పాటు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news