విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..?

-

కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అనుమతులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్యాలు పాఠశాలను ప్రారంభించేందుకు ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల పునఃప్రారంభం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలని ఇప్పటికే పలుమార్లు నిర్ణయించినప్పటికీ అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఎట్టకేలకు నవంబర్ 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను పునః ప్రారంభించేందుకు నిర్ణయించామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు పాఠశాలను ప్రారంభించాలి అనుకున్నప్పటికీ వాయిదా పడుతూ వస్తుంది. మరి ఈసారైనా పాఠశాలలు తెరిచుకుంటాయా లేదా అన్న అయోమయం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news