అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనేందుకు సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అక్కినేని, నాగార్జున ఫ్యామిలీ ఓటు హక్కును వినియోగించుకుంది. జూబ్లీహిల్స్ లోని ప్రభుత్వ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఇప్పటికే హీరోలు రానా, సాయి ధరమ్ తేజ్ కూడా విధిగా ఓటు వేశారు.
ఇక అటు హైదరాబాద్ మహా నగరంలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. తొలి 2 గంటల్లో హైదరాబాద్ లో 4.57 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం పోలింగ్ నమోదు అయింది. సనత్ నగర్ లో 1.2 శాతం, కూకట్ పల్లిలో 1.9 శాతం.. మేడ్చల్ లో 2 శాతం.. గోషామహల్ లో 2 శాతం.. చార్మినార్ లో 3 శాతం.. ముషీరాబాద్ లో 4 శాతం అయిందని అధికారులు స్పష్టం చేశారు.