మందకొడిగా పోలింగ్.. తొలి 2 గంటల్లో హైదరాబాద్ లో 4.57 శాతమే !

-

హైదరాబాద్ మహా నగరంలో మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. తొలి 2 గంటల్లో హైదరాబాద్ లో 4.57 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం పోలింగ్ నమోదు అయింది. సనత్ నగర్ లో 1.2 శాతం, కూకట్ పల్లిలో 1.9 శాతం.. మేడ్చల్ లో 2 శాతం.. గోషామహల్ లో 2 శాతం.. చార్మినార్ లో 3 శాతం.. ముషీరాబాద్ లో 4 శాతం అయిందని అధికారులు స్పష్టం చేశారు.

అటు హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదు అయిందని చెప్పారు అధికారులు. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్‌ నమోదైంది. వివిధ నియోజక వర్గాల పరిధిలో పోలింగ్‌ సరళిని అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 5.10 %, మంథనిలో 8.20%, కూకట్‌పల్లిలో 5.43 %, కోదాడలో 10.76%, కోరుట్లలో 11.83 %, ఎల్బీనగర్‌: 5.6% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహేశ్వరం: 5%, రాజేంద్రనగర్‌: 15%, శేరిలింగంపల్లి: 8%, చేవెళ్ల (ఎస్సీ): 5%, కల్వకుర్తి: 5%, షాద్‌నగర్‌: 7.2%, ఇబ్రహీంపట్నంలో 8.11 %, కొత్తగూడెంలో 8.33%, వేములవాడలో 9.80%, సిరిసిల్లలో 10.71% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news