nagarjuna will attend to nampally court over konda surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ కోర్టుకు రానున్నారట అక్కినేని నాగార్జున. నిన్న నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున తరపున వాదనలు సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వినిపించారు.

దీంతో పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు పేర్కొంది. ఈ తరుణంలోనే.. ఇవాళ కోర్ట్ కు హాజరు కానున్నారు అక్కినేని నాగార్జున. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని ఇవాళ నమోదు చేయాలని కోరారు నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి. తదుపరి విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది మనోరంజన్ కోర్టు. ఇది ఇలా ఉండగా… మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రూ.100 కోట్ల పరువు నష్టం దావా కేసు వేశారు అక్కినేని నాగార్జున.