చుక్కనీరు తాగకుండా చెమటలు చిందిస్తున్న హీరో..

హీరో అనగానే చక్కటి రూపం, కండలు తిరిగిన దేహం, ఒడ్డూ పొడవూ అన్నీ సమతూకంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అలాంటి క్వాలిటీస్ ఉండని వారిని హీరోలుగా పరిగణించరు. అందుకే హీరోలుగా మారిన వారు తమ ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. అందుకోసం ఎంత కష్టమైనా చేస్తారు. పాత్రకి అవసరం అనుకుంటే సిక్స్ ప్యాక్, ఇంకా అవసరమొస్తే ఎయిట్ ప్యాక్ చేస్తారు.

తాజాగా హీరో నాగశౌర్య తన కొత్త సినిమా కోసం ఎయిట్ ప్యాక్ లో దర్శనమిస్తున్నాడు. వరుస అపజయాలు ఎదుర్కొన్న తర్వాత నాగశౌర్య చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి నాగశౌర్య చాలా కష్టపడుతున్నాడు.

కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు బాడీ సరిగ్గా కనిపించడానికి ఐదురోజుల పాటు నీళ్ళు తాగకుండా ఉన్నాడట. కనీసం లాలాజలం కూడా మింగలేదట. సినిమాలో కొత్తగా కనిపించి ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయడానికి నాగశౌర్య బాగానే కష్టపడుతున్నాడు. ఈ విషయంలో లాక్డౌన్ టైమ్ లో కూడా స్ట్రిక్ట్ డైట్ పాటించాడట. ఈ మాత్రం డెడికేషన్ చూపిస్తున్నాడంటే సినిమా ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని అనుకుంటున్నారు.