అమితానందంలో నమిత..మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న హీరోయిన్

-

‘సొంతం’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్ నమిత. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. సొంతం సినిమా సమయంలో స్లిమ్ గా ఉండే ఈ హీరోయిన్ తర్వాత కాలంలో బొద్దుగా మారింది. ప్రభాస్ ‘బిల్లా’ సినిమాలో స్పెషల్ రోల్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత బాలకృష్ణ ‘సింహ’ చిత్రంలోనూ నటించింది.

2017లోవీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొంత కాలంగా ఈ సుందరి సినిమాలకి దూరంగా ఉంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ న్యూ చాప్టర్ బిగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో తను తల్లి కాబోతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం అమ్మతనం..పొందబోతున్నదని తెలుసుకుని అమితనాందంలో ఈ సంతోష సమయాలను తన భర్తతో పంచుకుంటోంది. తన భర్తతో తెలుపు రంగు డ్రెస్సులో బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు కంగ్రాట్స్, గాడ్ బ్లేస్ యూ అని ఆశీర్వదిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version