NBK 108 : “భగవంత్‌ కేసరి”గా బాలయ్య..ఇగ మాస్ ఊచకోత షురూ

-

NBK 108 : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “NBK 108” అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది.

షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ధి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ మునుపేన్నడు పోషించని పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. భగవంత్‌ కేసరి అనే టైటిల్‌ అనౌన్స్‌ చేస్తూ.. ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news