అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు

-

భారత్‌లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు లభించింది. ‘మెర్సర్స్‌ 2023 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే’ వెల్లడించిన వివరాల ప్రకారం.. అయిదు ఖండాల్లోని 227 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్​ 202వ స్థానాన్ని దక్కించుకుంది. దేశీయంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో ముంబయి నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె ఉన్నాయి. ప్రతి నగరంలో వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి 200 వరకు అంశాలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని, ఈ జాబితా రూపొందించారు.

ప్రపంచం మొత్తం మీద ఖరీదైన నగరాల్లో ముంబయికి 147వ స్థానం దక్కింది. దిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్‌ 202, కోల్‌కతా 211, పుణె 213వ స్థానాల్లో నిలిచాయి. ముంబయితో పోలిస్తే చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణెల్లో వసతి ఖర్చులు 50 శాతం తక్కువగా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు కోల్‌కతాలో అత్యంత తక్కువ వసతి ఖర్చులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news