నాని ‘జెర్సీ’ ట్రాజెడీ క్లైమాక్స్..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రికెటర్ రమన్ లంబా జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. అయితే అతను రంజీ ఆడుతూ మరణించడం జరిగింది. సో జెర్సీ సినిమాలో నాని కూడా ట్రాజెడీ ఎండ్ తో ముగిస్తాడని అంటున్నారు.

ఆల్రెడీ నాని చేసిన భీమిలి కబడ్డి జట్టు సినిమాలో కూడా ఇదే ట్రాజెడీ ఎండ్ తో ముగించాడు. ఆ సినిమా సక్సెస్ అవడంతో మరోసారి ఆ సాహసం చేస్తున్నాడు నాని. అయితే భీమిలి కబడ్డి జట్టు నాని నాచురల్ స్టార్ కాకముందు కాబట్టి ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు నాని పాత్ర ఎండ్ అవుతుంది అంటే ఒప్పుకుంటారా అన్నది చూడాలి.

అయితే రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈగ సినిమాలో కూడా నాని పాత్ర అర్ధాంతరంగా ఎండ్ అవుతుంది. మరి ఆ సినిమా సక్సెస్ అయ్యింది కదా అంటున్నారు. ఏది ఏమైనా దర్శకుడు రాసుకునే కథనాన్ని బట్టి సినిమా ఫలితం ఉంటుంది. జెర్సీ మీద నాని నమ్మకంతో ఉన్నాడట. అందుకే సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news