నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో నితిన్ సరసన హీరోయిన్ గా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి లయ కీలకపాత్రను పోషించింది. కాగా, ఈ సినిమా రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్, గేమ్ చేంజర్, థాంక్యూ, తమ్ముడు సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్లుగా మారాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వేణు శ్రీరామ్ పైన కూడా అనేక రకాల విమర్శలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో మొదట నితిన్ ను కాకుండా నేచురల్ స్టార్ నానినీ హీరోగా అనుకున్నారట. ఈ సినిమా కథను మొదట నానికి వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారట. ఈ సినిమా కథలో ఏదో తేడా ఉందని నాని ఊహించి ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారట. ఆ తర్వాత ఈ సినిమా కథను హీరో నితిన్ కు చెప్పగా ఆయన వెంటనే ఓకే చెప్పారట. ఈ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.