తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి హాట్ కామెంట్స్ చేసారు. నా మంత్రి పదవి అదృష్టమో దురదృష్టమో అర్ధం అవ్వడం లేదని బాంబు పేల్చారు. యువజన సర్వీసులు..గొర్రెలు బర్రెల శాఖ ఇస్తే నేనేం చేసుకోవాలని నిలదీశారు కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి.

పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉంది, యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలని అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి. ఇక అటు గత కొంత కాలం నుంచి బోడుప్పల్ ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఫిష్ వెంకట్ ను మంత్రి శ్రీహరి పరామర్శించారు.
ఆయన కుటుంబానికి రూ. లక్ష సహాయం అందించారు. ఫిష్ వెంకట్ వైద్య చికిత్స పూర్తి అయ్యేంత వరకు అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీహరి. ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే అతడిని తప్పకుండా బతికించాలని వైద్యులను రిక్వెస్ట్ చేశారు. దీంతో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.