అమెరికాలో పెను ప్రమాదం జరిగింది. అమెరికాలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనం ఐంది. వెకేషన్ కోసం డల్లాస్ కి వెళ్లిన కుటుంబం… సజీవ దహనం ఐంది. హైదరాబాద్ కి చెందిన తేజస్విని, శ్రీ వెంకట్, దంపతులతో పాటు తమ ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

సెలవులు ఉండటంతో అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లాడు వెంకట్. అట్లాంట నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిది. ట్రక్ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం అయ్యారు.