నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌యోగానికి రెడీ!

నేచుర‌ల్‌స్టార్ నాని తన కెరీర్‌లో అత్యంత చాలెంజింగ్ పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `వి` నిరూత్సాహ ప‌ర‌చ‌డంతో వ‌రుస‌గా కొత్త చిత్రాల్ని ప్రారంభించిన నాని `శ్యామ్ సింఘ్‌ రాయ్` లో 65 ఏళ్ల వ్యక్తిగా నటించడానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. 65 ఏళ్ల వృద్ధుడి పాత్రే ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

ఆ కార‌ణంగానే ఈ విష‌యాన్ని మేక‌ర్స్ సీక్రెట్‌గా వుంచుతున్నార‌ట‌. ఇంత వ‌ర‌కు నాని ఈ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌లేదు. న‌టించ‌లేదు. నాని చేయ‌బోయే ఈ పాత్ర నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆప్ట‌ర్ అనే స్థాయిలో వుంటుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ త‌ర‌హా పాత్ర నాని కెరీర్‌లో బిగ్ ఛాలెంజ్ అని ఇందు కోసం నాని చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

మోస్ట్‌లీ టాలెంటెడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఇందులో నానికి జోడీగా న‌టిస్తోంది. `ఉప్పెన‌` హీరోయిన్ కృతిశెట్టి ని మ‌రో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా డిసెంబ‌ర్ నుంచి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారు.