RRR సినిమాపై నారా లోకేష్ ట్వీట్…ఆహా,ఓహో అద్భుతమంటూ !

-

అమరావతి : RRR సినిమాపై టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేశారు. RRR సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయని.. తారక్, రామ్ చరణ్ కు కంగ్రాట్స్ అంటూ నారా లోకేష్‌ పేర్కొన్నారు. అలాగే.. RRR సినీ దర్శకుడు రాజమౌళి.. సినిమా యూనిట్‌ కు అభినందనలు తెలుపుతూ… నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

కాగా… ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రీమియ‌ర్ షోల‌ తో నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా న‌డుస్తుంది. మెగా, నందమూరి అభిమానుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో పండగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. దాదాపు వారం రోజుల టికెట్లు.. ఇప్పటికే బుక్‌ అయ్యాయి. ఇక ఇవాళ ఒక్కరోజే 40 కోట్ల కలెక్షన్లను ఆర్ఆర్‌ఆర్‌ రాబట్టే ఛాన్స్‌ ఉంది. మొత్తానికి ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు మూడింతలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news