మరోసారి పొలిటికల్ డ్రామాతో వస్తున్న నారా రోహిత్

-

నారా రోహిత్..  డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటూ.. జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తుంటాడు. ఈ యంగ్ హీరో నుంచి సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. చాలా గ్యాప్ తర్వాత..  తాజాగా ఆయన తన లేటెస్ట్ సినిమా అప్డేట్ ను షేర్ చేశాడు. వానరా ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నారా రోహిత్​ తన 19వ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు.

ఈ సినిమా ఫస్ట్​లుక్​ను జులై 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పోస్టర్​ను చూస్తే పొలిటికల్ టచ్​తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్​లో ‘ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు’ అని ఉంది. ఈ సినిమాపై నారా రోహిత్ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరికొందరు ఈ సినిమా ప్రతినిధికి సీక్వెల్​ అని కామెంట్లు పెడుతున్నారు. 2024 ఏపీ శాసససభ ఎన్నిసభ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలవ్వనుండడం వల్ల పొలిటికల్ డ్రామా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news