ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది. వరద నీటితో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నవసారి, జూనాగడ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో అతివారి వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. నవసారీలో 30 సెంటీమీటర్లు, జూనాగడ్ లో 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఈనెల 24 వరకు సౌరాష్టలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అహ్మదాబాద్ ఎయిర్పోర్టులోకి వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాని సొంత గుజరాత్ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ నిర్వాహణ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఇక అటు భారీ వర్షాలకు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
గుజరాత్ – భారీ వర్షాలకు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి.#GujaratRain #GujaratRains pic.twitter.com/SQDkRiaG4Q
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2023