ఓటీటీలోకి రక్షిత్‌ ‘నరకాసుర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

రక్షిత్‌ అట్లూరి హీరోగా సెబాస్టియన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘నరకాసుర’ . అజ్జా శ్రీనివాస్‌ నిర్మాత. అపర్ణ జనార్దన్‌, సంకీర్తన విపిన్‌ కథానాయికలు. శతృ, నాజర్‌, చరణ్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది నవంబరు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.  ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ‘నరకాసుర’ను అందుబాటులోకి తెచ్చారు. రూ.79 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. ఒకసారి సినిమా అద్దెకు తీసుకుని చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాలి.

ఇంతకీ కథేంటంటే: చిత్తూరు జిల్లాకు చెందిన శివ (రక్షిత్ అట్లూరి) ఓ కాఫీ ఎస్టేట్‌లో లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఎమ్మెల్యే నాగమ నాయుడు(చరణ్ రాజ్)అంటే అతనికి ఎంతో అభిమానం. నాయుడి గెలుపు కోసం ప్రత్యర్థులను సైతం చంపేస్తాడు. ఈ క్రమంలో ఒక రోజు శివ కనిపించకుండా పోతాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా తప్పిపోయాడు? అతన్ని బంధించిందెవరు? ఎమ్మెల్యే నాయుడు కుమారుడు ఆది నాయుడు(తేజ చరణ్ రాజ్)తో శివకు ఎందుకు వైరం ఏర్పడింది? తనను ప్రేమించిన మరదలు వీరమణి(సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్) కోసం శివ ఏం చేశాడు? అన్నది కథ.

Read more RELATED
Recommended to you

Latest news