‘మా’ ఎన్నికల ఫలితాలు: అధ్యక్షుడిగా నరేష్..!

-

‘మా’ ఎన్నికల్లో చాలామంది స్టార్ హీరోలు ఓటేయలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓటింగ్‌కు రాలేదు. ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రాంచరణ్ కూడా ‘మా’ ఎన్నికల్లో పాల్గొనలేదు.

రాజకీయ ఎన్నికలను తలపిస్తూ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు. 800 మంది సభ్యులున్న మాలో అధ్యక్ష పదవికి శివాజీ రాజాతో పాటు నరేష్ కూడా పోటీలోకి దిగారు. ఇదివరకు ఏకగ్రీవంగా ఎంపిక అయ్యే మా అధ్యక్ష పదవికి ఈసారి పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు.

‘మా’లో 745 ఓట్లు ఉన్నాయి. అయితే.. అందులో 473 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్స్ మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. గత రాత్రి ప్రకటించాల్సిన మా ఫలితాలను తాజాగా ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేసిన హేమ మా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగింది. శివాజీ రాజా తరుపున మా ప్యానెల్ బరిలో 25 మంది సభ్యులు దిగారు. నరేష్ ప్యానెల్ బరిలో 23 మంది సభ్యులు బరిలోకి దిగారు. గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్, జయసుధ మా పీఠం దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇప్పుడు కూడా శివాజీ రాజా, నరేష్ ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేస్తూ.. మా పీఠం దక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించినా.. విజయం మాత్రం నరేష్‌నే వరించింది.

మహేశ్ బాబు దూరం..

‘మా’ ఎన్నికల్లో చాలామంది స్టార్ హీరోలు ఓటేయలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓటింగ్‌కు రాలేదు. ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రాంచరణ్ కూడా ‘మా’ ఎన్నికల్లో పాల్గొనలేదు. చిరంజీవి, నాగార్జున మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు.

‘మా’ అధ్యక్షుడు – నరేష్
‘మా’ ఉపాధ్యక్షులు – ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ(స్వతంత్ర అభ్యర్థి)
కోశాధికారి – రాజీవ్ కనకాల
జనరల్ సెక్రటరీ – జీవిత రాజశేఖర్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – రాజశేఖర్

Read more RELATED
Recommended to you

Exit mobile version