నేనిలా మారడానికి కారణం వాళ్లే : నయనతార

-

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ సరసన ఇటీవలే జవాన్ సినిమాలో నటించింది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార.. సినిమాల ఎంపికలో ఈ భామ రూటే సపరేట్. ఇక సినిమా ప్రమోషన్స్​లో ఈ బ్యూటీ అస్సలు పాల్గొనదు.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామకు ఎక్కడా అకౌంట్ లేదు. తన పర్సనల్ లైఫ్​ను చాలా గోప్యంగా ఉంచడానికే ఈ భామ ఇష్టపడుతూ ఉంటుంది. అయితే, సినీ పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి నయనతార అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. తన విజయానికి కారణం ఫ్యాన్స్ ఏనని అందులో పేర్కొన్నారు. ’20 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ ఉన్నానంటే అందుకు మీరే కారణం. నా కెరీర్ కు వేరే గుండెచప్పుడు. అభిమానులు లేకుండా ఈ ప్రయాణం అసంపూర్ణం. నా ప్రతి ప్రాజెక్టును ప్రత్యేకంగా మార్చే మ్యాజిక్ మీ అభిమానమే’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులో స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news