నయనతార తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు దూరంగా నయన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. జైలర్‌లోని హుకుమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో.. తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని మాస్ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదొ అప్పుడే లక్ష ఫాలోవర్స్ వచ్చి చేరారు. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు నయన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి వచ్చింది.
అయితే.. ఈ తరుణంలోనే… లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకున్న ఇండియన్ నటిగా రికార్డు సృష్టించారు. ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన 10 గంటల్లోనే ఆమెకి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. గతంలో కత్రినాకైఫ్ కు 24 గంటల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ రాగా, ఆ రికార్డును నయనతార బ్రేక్ చేశారు. ప్రస్తుతం నయనతారకు ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన తొలి వీడియోకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.