హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడం శోచనీయం: డీకే అరుణ

-

గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రతులను స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి అందించేందుకు…. బీజేపీ ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి.. డీకే అరుణ శాసనసభకు వచ్చారు. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యాలయంలో తీర్పు కాపీని అందించి నిరాశతో వెనుదిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. గద్వాల ఎమ్మెల్యేగా తనను ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో స్పీకర్‌ ఆలస్యం చేస్తే… కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు చెప్పారు.

‘హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడం శోచనీయం. హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందించేందుకే అసెంబ్లీకి వచ్చాను. అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి అందుబాటులో లేరు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి తక్షణమే అమలు చేయాలి. హైకోర్టు తీర్పు ఇంకా ముందు వచ్చి ఉంటే బాగుండేది. నాలుగేళ్లపాటు గద్వాలను అభివృద్ధి చేసే అవకాశం కోల్పోయా. సోమవారం సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ కార్యాలయ జాప్యంపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం.’ అని డీకే అరుణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news