ఆమె ఓ ఐటెం.. పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావ్.. హీరోయిన్ పై నెటిజెన్ కామెంట్..!

-

సెలబ్రిటీస్ కు ట్రోలింగ్స్ అనేది సర్వసాధారనమే. నెటిజెన్స్ ట్రోలింగ్స్ కు మొదట్లో కాస్త ఆలోచించే సెలబ్రిటీస్ ఇప్పుడు వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. మొన్నామధ్య రకుల్ విషయంలో జరిగిన రచ్చ అందరికి తెలిసిందే. లేటెస్ట్ గా బిగ్ బాస్ తమిళ క్రేజీ కంటెస్టంట్ ఓవియా కూడా ఓ నెటిజెన్ మీద ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ కు ముందు ఓవియా ఓ సగటు హీరోయిన్ మాత్రమే కాని ఆఫ్టర్ బిగ్ బాస్ ఆమె క్రేజ్ పెరిగింది.

బిగ్ బాస్ హౌజ్ లో అదరగొట్టిన ఓవియా కోలీవుడ్ లో ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈమధ్యనే 90 ఎం.ఎల్ సినిమాతో హంగామా చేసిన ఓవియా రెండు కొత్త ప్రాజెక్టులలో నటిస్తుంది. ఎప్పుడు తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే ఓవియా ఈమధ్య తన బర్త్ డే రోజు తన ఫ్యాన్స్ తో స్పెషల్ చాట్ చేసింది. అందులో భాగంగా అమ్మడిని ఓ నెటిజెన్ ఓవియా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.

అయితే ఆమె దానికి సమాధానం ఇచ్చేలోపే ఆమె ఓ ఐటం ఆమెను పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావ్ అంటూ మరో నెటిజెన్ కామెంట్ పెట్టాడు. దీనికి రిప్లై గా ఓవియా.. మీ అమ్మ కూడా ఓ ఐటం అని కామెంట్ పెట్టింది. అలా నెటిజెన్ కామెంట్స్ తో ఓవియా కాస్త డిస్ట్రబ్ అయ్యింది. అయితే సెలబ్రిటీస్ కు ఇలాంటివన్ని కామన్ అయ్యాయి. మరి శృతిమించితే పోలీసులను యాక్షన్ లోకి దించుతున్నారు. ప్రస్తుతం ఓవియా తమిళ నటుడు అరవ్ తో ప్రేమలో ఉన్నదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version