నమ్రతా పై ఫైర్ అవుతున్న నెటిజన్స్.. ఏమైందంటే..?

-

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. ఒకప్పటి హీరోయిన్ నమ్రతల కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఈ చిన్నారి వయసు పెరిగే కొద్దీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె తన తండ్రి నుండి ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఇక తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని డాన్స్ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన పేరు మీద అతి చిన్న వయసులోనే ఖాతాను సృష్టించుకుని సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అంతా కాదని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసే సితార అప్పుడప్పుడు తన తండ్రితో సినిమా సెట్ కి వెళ్లి అక్కడ జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఏదో ఒక పోస్టుతో నెటిజన్లను ఆకట్టుకునే సితార ఈమధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది. గత ఏడాది తన తండ్రి మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని ఒక పాటలో స్టేప్పులేసిన సితార.. ఇక సోషల్ మీడియాలో ఈమె చూపించే ఎనర్జీని చూసి హీరోయిన్ అవడం ఖాయం అంటూ చాలామంది చెబుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నమ్రత సితారకు సంబంధించిన రెండు ఫోటోలను పంచుకుంది. అందులో తాను బెడ్ పై కూర్చుని ఉండగా కేవలం టీ షర్టు మాత్రమే ధరించి కింద ప్యాంటు వేసుకోకుండా ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. అందులో సితార థైస్ చాలా క్లియర్ గా బయటపడ్డాయి. ఇది చూసిన మహేష్ అభిమానులు నమ్రతా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూతుర్ని ఎలా పెంచాలో కూడా తెలియదా? ఒక తల్లి ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తుందా? అంటూ దారుణంగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సితార ఫోటోలు షేర్ చేసి నమ్రత అభిమానుల ఆగ్రహానికి గురవుతోందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read more RELATED
Recommended to you

Latest news