ఈఫిల్ టవర్​పై జాన్వీ-వరుణ్‌ల ‘బవాల్‌’ సినిమా ప్రదర్శన

-

వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన సినిమా.. ‘బవాల్‌’. ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ సినిమా జులైలో నేరుగా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే అంతకంటే ముందు పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌పై ఈ మూవీని ప్రదర్శించబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్.

‘‘జులై రెండో/మూడో వారంలో ప్రీమియర్‌ వేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈఫిల్‌ టవర్‌పై సందడి చేయనున్న తొలి భారతీయ చిత్రంగా ‘బవాల్‌’ రికార్డుకెక్కనుంది. చిత్ర బృందంతో పాటు సినీ ప్రియులు, ఫ్రెంచ్‌ ప్రతినిధులు ఈ ప్రీమియర్‌కి హాజరుకానున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అధిక భాగం పారిస్‌లోనే జరిగింది. కథలో అదొక భాగం’’ అని బీ టౌన్​ మీడియా కోడై కూస్తోంది. ‘బేఫికర్‌’లాంటి ఇండియన్‌ సినిమా ట్రైలర్లు ఈఫిల్‌ టవర్‌పై ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. పూర్తి సినిమా ప్రీమియర్‌ కానుండడం ఇదే తొలిసారి. ప్రేమ, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బవాల్​ సినిమా రూపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news