సాధారణంగా అటు వెండితెరపై లేదా బుల్లితెరపై సెలబ్రిటీల మధ్య మంచి స్నేహబంధం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ స్నేహబంధం బయట కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. వాస్తవానికి స్నేహంలో కొన్ని తప్పులు పట్టాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది కావాలని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని తప్పుపడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటిదే గెటప్ శ్రీనుకు ఎదురయిందని చెప్పాలి తాజాగా అనసూయ షేర్ చేసిన పోస్ట్ కు గెటప్ శ్రీను స్పందించగా వెంటనే మరొక నెటిజన్ ఫైర్ అవుతూ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ కామెంట్ చేశారు.
జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని భయంకరంగా చలామణి అయిన ఈమె ఇప్పుడు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా దూసుకుపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం అనే చెప్పాలి. ఇక జబర్దస్త్ వేదికపై తాను వేసిన డాన్స్లకు మాత్రం కుర్రాళ్ళు సైతం ఫిధా అయ్యేవారు. జబర్దస్త్ షో ద్వారానే ఈమెకు వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ. అంతే కాకుండా వెండితెరపై కూడా టాలెంట్ నిరూపించుకుంది.ఇప్పుడైతే వరుస హిట్టు సినిమాలతో బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా ఆమె నటించిన చిత్రం విమానం.. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అందులో మేడే శుభాకాంక్షలు అని చెబుతూ ఒక గోడ మీద చీర కట్టుకొని కూర్చున్న తన ఫోటోని షేర్ చేసింది. ఇది చూసిన చాలా మంది చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే జబర్దస్త్ గెటప్ శ్రీను..”ఆల్ ద వెరీ బెస్ట్ అను” అంటూ పంచుకోగా వెంటనే ఒక నెటిజన్ గెటప్ శ్రీను ని టైప్ చేసి పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లో కామెంట్ చేస్తున్నప్పుడు మర్యాదకరంగా కామెంట్ పెట్టు బ్రో.. అనసూయ గారు అని పెట్టు కామెంట్ .. అను ఏంటి.. అను ఏమైనా నీ స్కూల్ ఫ్రెండా.. కాలేజ్ ఫ్రెండా.. లేక నీకు చుట్టమా.. పబ్లిక్ గా కామెంట్ చేసేటప్పుడు గారు అనే సంబోధించాలి అంటూ కామెంట్ చేశాడు.
అయితే ఈ కామెంట్ వైరల్ గా మారింది.. కానీ అనసూయ మాత్రం గెటప్ శీనుకి థాంక్యూ శీనా అంటూ స్పందించింది.