‘విదుతలై’లో విజయ్ సేతుపతి మ్యాజిక్..వెట్రిమారన్ మార్క్ మూవీ

-

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ..మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే.. ‘సైరా’, ‘ఉప్పెన’ చిత్రాలతో తెలుగు వారి ఆదరణ పొందుతున్న ఈ స్టార్ హీరో సినిమాలను తెలుగు వారు అత్యంత ఇష్టంగా చూస్తున్నారు. అయితే, విజయ్ సేతుపతి హీరోగా సినిమాలు చేస్తూనే పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తు్న్నారు.

అలా విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న పిక్చర్ ‘విదుతలై’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో లీడ్ రోల్ సూరి ప్లే చేస్తుండగా, కీలక పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తున్నారు.

భవాని శ్రీ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సదరు ఫొటోల్లో సూరి, విజయ్ సేతుపతిల ఇంటెన్స్ లుక్స్ సినిమాపైన అంచనాలను ఇంకా పెంచుతున్నాయి. ఫిల్మ్ లో వెట్రిమారన్ మార్క్ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్స్ రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version