టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే స్పై సినిమాతో అలరించాడు. ఆ తర్వాత స్వయంభూ చిత్రం చేస్తూ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది కార్తికేయ ఫ్రాంచైజీ. మొదటి సినిమాతో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్న నిఖిల్.. కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు. ఇక తాజాగా పార్ట్-3 కూడా తెరకెక్కించున్నట్లు సమాచారం. ఈ విషయంలో నిఖిల్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు.
సరికొత్త సాహసంతో త్వరలోనే ‘కార్తికేయ 3’ తెరకెక్కనుందనే నిఖిల్ హింట్ ఇచ్చాడు. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ’, ‘కార్తికేయ2’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘కార్తికేయ2’ అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించింది. దీని సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. ‘కార్తికేయ 3’ రూపొందుతుందని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా ‘తండేల్’ తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే అవకాశాలున్నాయి.