ఇంట్రెస్టింగ్​గా నిఖిల్ ‘స్వయంభూ’ మూవీ పోస్టర్

-

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఇప్పుడు కాస్త సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది నిఖిల్ సిద్ధార్థ్​కు. కార్తికేయ, కార్తికేయ-2, 18 పేజెస్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు నిఖిల్. అందరిలా కాకుండా డిఫరెంట్ కంటెంట్​తో ఎప్పటికప్పుడు తనను తను మెరుగు పరుచుకుంటూ ప్రేక్షకులకు కొత్త కంటెంట్​ను అందిస్తున్నాడు. అందుకే ప్రేక్షకులు ఈ యంగ్ హీరోకు నీరాజనం పడుతున్నారు. ఇటీవలే స్పై సినిమాతో అలరించిన నిఖిల్.. తాజాగా స్వయంభు అనే సినిమాతో ముందుకొస్తున్నాడు.

తమిళంలో పలు సినిమాలు రైటర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్‌ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. గుర్రపు స్వారిపై డ్రాగన్‌ నోటిలో మంటలు చెలరేగుతున్న బాణం ఎక్కుపెట్టి యుద్ద వీరుడుగా ఉన్నట్లు నిఖిల్‌ పోస్టర్‌ను వీర లెవల్లో డిజైన్‌ చేశారు. ఈ పీరియాడిక్‌ డ్రామాలో టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ సంయుక్త మీనన్ హీరోయిన్​గా నటిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news