ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే నూతన బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇందిరా పార్క్ నుండి VST వరకు 450 కోట్ల రూపాయల తో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం ప్రారంభించనున్నారు మున్సిపల్ మంత్రి KTR. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద MLA ముఠా గోపాల్, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో ఇందిరా పార్క్, RTC క్రాస్ రోడ్డు, VST జంక్షన్ లలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. స్టీల్ బ్రిడ్జికి మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి నామకరణం చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి KTR ఆధ్వర్యంలో విశ్వనగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని వివరించారు. ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.