నితిన్ కు `చెక్‌` పెట్టిన చంద్రశేఖ‌ర్ ఏలేటి!

-

నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రానికి `చెక్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. గురువారం  ఈ చిత్ర టైటిల్‌తో పాటు ప్రీలుక్ పోస్ట‌ర్‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేశారు.

చ‌ద‌రంగం నేప‌థ్యంలో సాగే ఉరిశిక్ష‌ప‌డిన ఓ ఖైదీ క‌థ‌గా ఈ చిత్రాన్ని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెర‌కెక్కిస్తున్నారు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీగా హీరో నితిన్ ఇందులో క‌నిపించ‌బోతున్నాడు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. నితిన్ న‌ట‌న హైలైట్‌గా స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా ఈ మూవీ సాగ‌నుంద‌ని తెలిసింది. ఈ నెల 12 నుంచి చివ‌రి షెడ్యూల్‌ని ప్రారంభించి ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పూర్తి చేయ‌నున్నారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌కిది తెలుగులో తొలి చిత్రం. పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీశ‌ర్మ‌, త్రిపుర‌నేని సాయిచంద్‌, సంప‌త్‌రాజ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రోహిత్ పాథ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news