నిత్యా మీనన్ కు వేధింపులు.. క్లారిటీ ఇదే !

-

నిత్య మీనన్.. ప్రముఖ మలయాళీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగు , తమిళ్ , మలయాళం భాషా ఇండస్ట్రీలలో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. నిత్యామీనన్ కేవలం నటించింది 50 సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకోవడం గమనార్హం. ఈమె అన్నీ కూడా సెలెక్టివ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నిత్యామీనన్.. తన నటనకు గాను ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు రెండు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

అయితే, ఓ తమిళ హీరో వేధించాడని తాను చెప్పినట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ నిత్యామీనన్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, పుకార్లు స్ప్రెడ్ చేయడంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ‘మనమంతా కొంత సమయాన్ని గడిపేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ, ఇలా ఒకరిపై ఇంకొకరు తప్పుడు ప్రచారం చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవి ఆపేందుకు మాత్రం నేను వీటిని ఎత్తిచూపుతున్నా’ అని నిత్య ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news