మెగా హీరో సాయి ధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సో బెటరు” నుంచి నో పెళ్ళి సాంగ్ రిలీజ్…!

-

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “సోలో బ్రతుకే సో బెటరు” రీసెంట్ గా చిత్రలహరి, ప్రతీరోజూ పండగే సినిమాలతో సూపర్ హిట్స్ ఈ మెగా హీరో. ఇదే జోష్ తో మరోసారి యంగ్ డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో “సోలో బ్రతుకే సో బెటరు” సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాని ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

ఇక ఈ సినిమానుండి తాజాగా “నో పెళ్ళి” అనే సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. గత రెండు రోజుల క్రితం ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగాగానే చెప్పిన సమయానికి ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఇక త్వరలో ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించబోతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో పాటు సాయి ధరం తేజ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భవాన్, పుల్లా రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కి జంటగా నివేదా పేతురాజ్ నటిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news