నక్సలైట్ గా సాయి పల్లవి ఒక్కరేకాదు ప్రియమణి కూడా ..!

-

జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న హీరోయిన్ ప్రియమణి కి ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకులలో చాలా క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియమణి కి వరసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలకి ఛాయిస్ గా మారుతుంది ప్రియమణి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకి ఇప్పుడు వారి ఏజ్ కి తగ్గ హీరోయిన్స్ దొరకడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ ఈ సమస్యని బాగా ఎదుర్కుంటున్నారు.

 

ఇలాంటి సమయంలో ప్రియమణికి వరసగా అవకాశాలు వస్తుండటం గొప్ప విషయం. ఇక ఇప్పటికే ప్రియమణి కి తెలుగులో ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో ప్రియమణి మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తమిళంలో భారీ హిట్ అయిన అసురన్ రీమేక్ తెలుగులో వెంకటేష్ తో నారప్ప గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కి బ్యార్యగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమా గనక హిట్ అయితే సీనియర్ స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కడతాయన్న ఆశతో ఉంది.

 

ఇక మరో సినిమాలోను ప్రియమణి నటిస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘విరాటపర్వం’. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 70శాతం టాకీ పార్ట్ ని కంప్లిట్ చేసుకుంది. ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ గా సాయిపల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారు. ఇదే సినిమాలో ప్రియమణి కూడా నటిస్తుంది. అయితే ఇంతకాలం ప్రియమణి నటిస్తున్న పారే ఏమిటన్నది సస్పెన్స్ గా ఉంచారు. ఇప్పుడది లీకయింది. సాయి పల్లవి తోపాటు ప్రియమణి కూడా నక్సలైట్ గానే నటిస్తుందని తాజా సమాచారం. ఒకేసారి ఇలా బాబాయ్, అబ్బాయ్ లతో అవకాశం అందుకున్న ప్రియమణి కి మరో రెండు సినిమాలు డిస్కర్షన్ లో ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version