జపాన్‌ అభిమానిపై ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్టు

-

అభిమానానికి అవధుల్లేవు. ఈ మాటను అక్షరాల నిరూపించారు ఓ జపాన్ మహిళ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన ఓ జపనీస్ మహిళ.. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు ఏకంగా తెలుగు భాష నేర్చుకుంది. రెండేళ్లపాటు కష్టపడి తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడమే గాక.. రాయడం కూడా నేర్చుకుంది. తారక్ నటించిన దేవర సినిమా ఇటీవల జపాన్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఆ దేశంలో పర్యటిస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ జపాన్ అభిమానులను కలిశారు. వారికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సమయంలో ఓ అభిమాని అన్నా నీ కోసమే తెలుగు నేర్చుకున్నాను అంటూ తెలుగులో మాట్లాడటంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ షాక్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో షేర్ చేసి ఎక్స్ వేదికగా తారక్ ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తానెప్పుడు సందర్శించినా జపాన్‌ మంచి జ్ఞాపకాలు అందిస్తుంటుందని.. కానీ, ఈసారి భిన్నంగా అనిపించిందని అన్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని ఓ జపనీస్‌ లేడీ ఫ్యాన్ చెప్పడం నన్ను కదిలించింది. సినిమాలన్నా.. వివిధ భాషలు నేర్చుకోవడమన్నా నాకు మహా ఇష్టం. విభిన్న సంస్కృతులతో పాటు భాష నేర్చుకునేందుకు సినిమా ఉపయోగపడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. భారతీయ సినిమా ప్రపంచస్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకుంటుందనేందుకు ఇది మరో కారణం’’ అని తారక్ తన పోస్టులో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news