హృతిక్ రోషన్​ కు గాయాలు.. ఎన్టీఆర్ వార్​ 2 షూటింగ్​ కు బ్రేక్​

-

బాలీవుడ్ స్టార్​ హీరో హృతిక్ రోషన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కాలికి గాయమైనట్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ మేరకు అద్దం ముందు నిల్చున్న ఫొటోను కూడా షేర్‌ చేశారు. అందులో ఆయన నడుముకు బెల్ట్‌ పెట్టుకుని, క్రచస్‌ (ఊతకర్ర) సపోర్ట్‌తో నిల్చున్నారు. మీలో ఎంత మందికి ఈ క్రచస్‌ , వీల్‌ఛైర్‌ అవసరం వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఈ పోస్టు చూసిన టైగర్ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, వాణీ కపూర్‌ సహా పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులు హృతిక్ రోషన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హృతిక్ గాయం వల్ల కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల  వార్‌ 2 సినిమా షూటింగ్​ వాయిదా పడే అవకాశం ఉంది. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ వార్​ 2 సినిమాను గ్రాండ్ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్ టైగర్, హీరో ఎన్టీఆర్‌ నటించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కాస్త నెగెటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తారని ఆ మధ్య కథనాలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version