మరోసారి అలా కనిపించి ఫిదా చేసిన నేషనల్ క్రష్..!

-

నేషనల్ రష్మిక మందన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలనే కాదు యావత్ సినీ ప్రేక్షకులను తన వశం చేసుకుంది. తాజాగా ముంబై వీధుల్లో తలుక్కుమని మెరిసిన ఈమె టోర్న జీన్స్ లో ట్రెండీగా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే రష్మిక అన్ ప్రొఫెషనల్ లుక్ చాలా వైరల్ గా మారుతుంది. రష్మిక అందాలకు యువత సైతం మరొకసారి ఫిదా అయ్యారని చెప్పాలి. చాలా సింపుల్ గా ఫ్యాషన్ గా కనిపించిన ఈమె ముంబై వీధుల్లో తిరుగుతూ కెమెరా కంటికి చిక్కడంతో ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే రష్మిక ప్రస్తుతం తన కెరీర్లో జెడ్ స్పీడ్ తో దూసుకుపోతోంది.. ఊహించిన విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఛలో సినిమా ద్వారా పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. అలా మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలతో నటించిన ఈమె మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. అంతేకాదు క్యారెక్టర్ నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించడానికి సిద్ధమేనని ప్రూవ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అందుకు ఉదాహరణ సీతారామం సినిమా అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా విజయం అయినప్పటికీ కూడా ఆ క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాగూర్ కి లభించింది.

ఇకపోతే ప్రస్తుతం తమిళ్, తెలుగు అని తేడా లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే అక్కడ పెద్ద ప్రాజెక్టులలో అవకాశం సొంతం చేసుకున్న ఈమె మరొకవైపు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా రష్మిక స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా ఆమె మరో ఐదేళ్లు స్టార్ హీరోయిన్ హోదా నుంచి దిగేటట్టు కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version