‘ఇస్మార్ట్’ కాంబో రిపీట్.. ఇవాళ సాయంత్రం ‘దిమాక్‌ ఖరాబ్‌’ అనౌన్స్​మెంట్

-

ఇస్మార్ట్ శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా రోజులుగా ఫ్లాపులతో సతమతమవుతున్న సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్​కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అందించిన విషయం తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా.. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా.. నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రామ్‌ నటన, పూరి టేకింగ్‌ మాస్‌ను మెప్పించాయి.

ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూరి జగన్నాథ్‌ చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ స్పెషల్‌ అప్‌డేట్‌ను పంచుకుంది. ‘నాలుగేళ్ల తర్వాత ఉస్తాద్‌ రామ్‌ పోతినేని, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కలిసి పనిచేయబోతున్నారు. దిమాక్‌ ఖరాబ్‌ అనౌన్స్‌మెంట్‌’ అంటూ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం 4గంటలకు తెలియజేయనున్నట్లు వెల్లడించింది. 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బాక్సాఫీస్‌ వద్ద రూ.75కోట్లకు పైగా వసూలు చేసింది. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version