రవితేజ కి మాత్రమే అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

-

సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు కావాలని ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే అలాంటి వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. అలా సక్సెస్ అయిన వారిలో రవితేజ కూడా ఒకరు. రవితేజ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారని చెప్పవచ్చు. అయితే రవితేజ తో ఎంతో మంది హీరోయిన్లు నటించిన.. ఒక్క హీరోయిన్ మాత్రం అన్ లక్కీ హీరోయిన్ గా పేరు పొందింది. ఈ హీరోయిన్ మాత్రం ఎంతోమందికి లక్కీ హీరోయిన్గా మారిన రవితేజకు ఒక్కటే ఫ్లాపులను ఇచ్చింది. ఆ హీరోయిన్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం

తెలుగు సినీ ఇండస్ట్రీలో చందమామ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించింది కాజల్ అగర్వాల్. మొదట వరుసగా ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు అందరితో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అందుకే హీరోలు మాత్రమే కాకుండా దర్శక, నిర్మాతలకు కూడా కాజల్ అగర్వాల్ లక్కీ హీరోయిన్గా మారిపోయింది. అలా రవితేజ ,కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన వీర ,సారొచ్చారు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వీరా చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించారు రవితేజ. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రొమాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుంది.. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ పరశురాం తో కలిసి సారొచ్చారు సినిమాలో నటించారు రవితేజ, కాజల్ అగర్వాల్ ఈ చిత్రం కూడా ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో రవితేజ కు మాత్రమే ఈ హీరోయిన్ అన్ లక్కీ గా పేరుపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news