రెండు రోజుల కిందట నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. మొన్న రాత్రి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరు తరలించారు.
తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది.
అయితే, ప్రస్తుతం NHలో తారకరత్న కు వైద్యం కొనసాగుతోంది. నేడు తారకరత్న కు మరోసారి కీలమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు NH వైద్యులు. పరీక్షల ఫలితాల తరువాత తదుపరి అందించాల్సిన వైద్యం క్లారటీ రానున్నారు వైద్యులు. నేడు నిర్వహించే టెస్ట్ ఫలితాలు చాలా కీలకమైనదన్నారు పురందేశ్వరీ, నందమూరి చైతన్య కృష్ణా. ఇక నేడు తారకరత్న వైద్య సహాయం కోసం మరికొద్ది మంది స్పెషలిస్టు డాక్టర్ బృందం రానుంది. నిన్నటి నుండి అందిస్తున్న చికిత్సకు పలుమార్లు తారకరత్న శరీరం స్పందించిందంటూన్నారు కుటుంబ సభ్యులు.