టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ ఖాతాలో ఓ హిట్ మూవీ పడింది.
‘గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన’ అంటూ ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్లోనూ థ్రిల్ పంచింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందంతో పాటు, ప్రైమ్ వీడియో కూడా సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. సందీప్ కిషన్ నటన, కథలోని ట్విస్ట్‌లు, ముఖ్యంగా విరామ సన్నివేశాలు ఈ సినిమాను నిలబెట్టాయి. వీఐ ఆనంద్ తనదైన శైలిలో మూవీని తీర్చిదిద్దడంలో మంచి మార్కులు కొట్టేశారు.