Naatu Naatu : ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ పర్ఫామెన్స్.. చప్పట్లతో మార్మోగిపోన డాల్బీ థియేటర్

-

95వ ఆస్కార్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తారలంతా హాజరయ్యారు. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా హాజరైంది. తెలుగు పాట ‘నాటు నాటు’ను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు. హాలీవుడ్‌ డ్యాన్సర్లు ఈ పాటకు చిందులేశారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఈ పాటను ఒరిజినల్​గా పాడిన సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేడికగా లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వగా.. అమెరికన్ నటి, డ్యాన్సర్ లారెన్​ గోట్లిబ్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు కొద్దిక్షణాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కుతుందో లేదో తెలిసిపోతుంది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్‌లిస్ట్​కు ఎంపికైన ఈ సినిమాకు పురస్కారం దక్కాలని యావత్ ఇండియా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక నెరవేరుతుందో లోదే చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news