వరల్డ్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ప్రదాన వేడుకలు ఈ ఏడాది మార్చి 11వ తేదీన జరగనున్నాయి. మరో నాలుగు రోజుల్లో జరగనున్న 96వ ఆస్కార్ అవార్డ్ వేడుక గ్రాండ్గా జరగనుంది. ఈ అకాడమీ అవార్డ్స్ వేడుకలను భారతీయులకు లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు నిర్వాహకులు. ఆదివారం రాత్రి జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నంది. హాస్యనటుడు జిమ్మీ కిమ్మెల్ నాలుగోసారి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్నాడు.
భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా తెలిపింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను జోడించి ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు ఓపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో, బార్బీ, పూర్ థింగ్స్ అమెరికన్ ఫిక్షన్ వంటి లాంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి. భారత్ నుంచి బరిలో టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీ ఉంది.