‘ఈ సినిమాలు చూడండి’.. కేటీఆర్​కు ఓటీటీల రికమెండేషన్

-

కాలిగాయంతో మూడు వారాల విశ్రాంతిలో ఉన్న కేటీఆర్.. తాను ఓటీటీలో ఏమేం సినిమాలు చూడాలో సలహా ఇవ్వాలని ట్విటర్​లో కోరారు. దీనిపై పలు ఓటీటీ సంస్థలు స్పందించాయి. ఆదివారం రోజు పుట్టిన రోజు జరుపుకున్న కేటీఆర్​కు బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు.. తమ ఓటీటీల్లో ప్రసారమవుతున్న సినిమాలు, సిరీస్​లను రికమెండ్ చేశాయి.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా కేటీఆర్​కు బర్త్ డే విషెస్ చెప్పి.. త్వరగా కోలుకోవాలంటే తమ ఓటీటీలో ప్రసారమవుతున్న డీజే టిల్లు చూడాలని సలహా ఇచ్చింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఎన్‌బీకే అన్‌స్టాపబుల్‌’, అమలాపాల్‌ నటించిన ‘కుడి ఎడమైతే’, ప్రియమణి ‘భామాకలాపం’ కూడా మిస్సవద్దని మరీమరి చెప్పింది.

మరోవైపు జీ5 కూడా కేటీఆర్‌కు కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను సూచించింది. “కేటీఆర్‌ గారూ గుడ్‌ మార్నింగ్‌.. ‘మా నీళ్ల ట్యాంకు’తో స్టార్ట్‌ చేసి, ‘రెక్కి’తో థ్రిల్‌ అవుతూ.. లంచ్‌ టైమ్‌కి ఫ్యామిలీ మొత్తం ‘ఒక చిన్న ఫ్యామిలీ’ స్టోరీ కంప్లీట్‌ చేసి.. రాత్రికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూసేయండి. త్వరగా రికవరీ అవుతారు. కానీ.. ఒక్క విషయం జాగ్రత్త.. ‘చూస్తూనే ఉండిపోతారు'”.. అంటూ తనదైన స్టైల్​లో ట్వీట్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version