శృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘ ఉప్పెన’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. తన నటన అందంతో అందర్ని కట్టి పడేసింది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
ఉప్పెన ఇచ్చిన సక్సెస్ తో కృతి శెట్టికి వరసగా ఆఫర్ల వస్తున్నాయి. తెలుగులో తను నటించి తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందు నుంచే వరసగా కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అనతి కాలంలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది.
ఇటు వరసగా సినిమాలో బిజీగా ఉన్నా…తను సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. తన లెటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. తన లేలేత అందాలతో అభిమానులను, నెటిజెన్లను ఫిదా చేస్తోంది. తాాజాగా తన లెటెస్ట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. బుల్లెట్ భామ అందానికి నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. సో స్వీట్, హిాట్, సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రసుతం కృతి శెట్టి వరసగా సినిమాలు చేేస్తోంది. తాను నటించిన ఉప్పెన, శ్యాంసింగరాయ్, బంగార్రాజు, ‘ది వారియర్’ వరసగా విజయాలు అందుకోవడంతో చాలా ఆనందంలో ఉంది బేబమ్మ. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ లు, హాట్ సీన్లకు కూడా ఓకే చెబుతోంది ఈ క్యూట్ బ్యూటీ.
ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో సుధీర్ బాబుతో చేస్తున్న ‘ ఈ అమ్మాయి గురించి మీకు చెబుతా‘, నితిన్ హీరోగా ‘ మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో మెరువనుంది. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో సూర్య, బాలా డైరెక్షన్ లో వస్తున్న ఓ మూవీలో కూడా కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు.