BREAKING : తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఉత్తర ఇంటీరియర్ ఒడిస్సా & పరిసర చ్చట్టిస్ ఘడ్ లలో ఉన్న ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉంది.
నిన్నటి ఉత్తర – దక్షిణ ద్రోణి ఈరోజు బలహీనపడింది. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబ్ నగర్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు… మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.